నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ముప్కాల్‌లో నిర్మిస్తున్న పంప్ హౌస్ వద్ద శైలేంద్ర అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పంప్‌హౌస్ సర్జీ పూల్పైకి ఎక్కి సెంట్రింగ్ పని చేస్తుండగా సేఫ్టీ బెల్ట్ తెగిపోయి కింద పడ్డారు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు జార్ఖండ్‌లోని గర్వ జిల్లాకు చెందినవాడు.
ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్!