నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామానికి సరిహద్దులు నిర్ణయించి... తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామంగా ఉండడంతో అమద్ధపూర్, ఖానాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వం ఇచ్చిందని... అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామపంచాయతీ శివారులో ఉన్న నివాస గృహాల పన్నులను తమకే ఇవ్వాలని ఇరు గ్రామాలు తమకు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సరిహద్దులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా