ETV Bharat / state

అన్నల గుప్పిట వదిలి.. అభివృద్ధి వైపు అడుగేసింది

నిజామాబాద్‌ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండే ఆ ఊరు.. ఒకప్పుడు తుపాకుల మోతతో దద్దరిల్లేది. వర్గపోరు, పగాప్రతీకారాలతో అట్టుడికింది. రాజకీయ ఆధిపత్య పోరులో నలిగిపోయింది. ఫలితంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. కానీ గ్రామస్థుల్లో వచ్చిన మార్పు వారిని ఐక్యతవైపు నడిపించింది. పదేళ్లలో రూ.10 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టి 'శెభాష్ మదన్​పల్లి' అనిపించింది.

Madan Palli village in Nizamabad is stepping up towards development
అన్నల గుప్పిట వదిలి.. అభివృద్ధి వైపు అడుగేసింది
author img

By

Published : Mar 17, 2020, 6:34 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే మదన్​పల్లి. 1990వ సంవత్సరం నుంచి ఆరేళ్లపాటు ఓ వైపు పోలీసులు, మరో వైపు అన్నల గుప్పిట్లో వణికిపోయింది. ఊర్లో సగం మంది మావోయిస్టులకు సానుభూతిపరులుగా ఉండేవారు. 90 మంది యువకులు నక్సలైట్లకు అనుకూలంగా చురుకైన పాత్ర పోషించేవారు. అప్పటి ఎస్పీ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం తనిఖీలతో హడలెత్తించేవారు. ఈ క్రమంలో అదే సంవత్సరం జూన్​ 11న స్థానికులైన ప్రసాద్​(దళనాయకుడు)తో పాటు స్వామి, నర్సక్క, ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. అంతకు కొన్ని రోజుల ముందే నక్సల్స్​ సానుభూతిపరులైన కాంతారావు, ఒడ్డెన్నలు అదృశ్యమయ్యారు.

1996లో ఇన్​ఫార్మర్​ అన్న నెపంతో సాయిలు అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. నక్సలైట్లు ఆయనను చంపేసి తలను గ్రామ నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం ముందు పెట్టి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి ఊర్లో భయానక వాతావరణం నెలకొంది. పగలు సైతం ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు యువకులు భయపడేవారు.

ఆధిపత్య పోరుతో..

చాలారోజుల పాటు పోలీసులు, అన్నల మధ్య నలిగిపోయిన స్థానికులు 1997 నుంచి రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన పోరులో నలిగిపోయారు. నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది పరిస్థితి. ఘర్షణలు, కొట్లాటలు నిత్యకృత్యంగా ఉండేవి. అధికారులు సైతం అక్కడికి వెళ్లాలంటే వణికిపోయేవారు. కనీసం విద్య, వైద్యం, తాగు, సాగు నీరు సౌకర్యాలకు కూడా మదన్​పల్లి నోచుకోలేకపోయింది.

గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో..

ఇప్పుడు ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. విభేదాలు పక్కనపెట్టి అందరూ కలిసిపోయారు. కొన్ని నెలల నుంచి ఐక్యతా రాగం వినిపిస్తోంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులైనా నాయకులు కూడా అభివృద్ధి విషయంలో రాజీపడడం వారికి ఎంతగానో కలిసివచ్చింది. గత పదేళ్లలోనే సుమారు రూ.10 కోట్ల వ్యయంతో పంచాయతీ పరిధిలో మూడు బీటీ రోడ్లు, ఐదు నీటి బ్యాంకులు, పాఠశాల, పశువైద్యశాల, పక్కా భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. తాజాగా రూ. 15లక్షల ఖర్చుతో వ్యాపార సముదాయం. రూ. 6 లక్షల వ్యయంతో వినాయకుడు, మహాలక్ష్మి మందిరాలను గ్రామస్థులు సొంత డబ్బులతో నిర్మించారు. స్థానికుడైన హైకోర్టు లాయర్​ సత్యం రెడ్డి సహకారం, వీడీసీ నిధులతో మినరల్​ వాటర్​ ప్లాంట్​ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ శివారులో నుంచి వృథాగా వెళ్తున్న నీటిని పైప్​లైన్లు, విద్యుత్​, మోటార్ల సహాయంతో తమ పంట పొలాల్లోకి మళ్లించేందుకు రూ. లక్షలు వెచ్చించారు. నాలుగు సంవత్సరాల నుంచి ఆ నీటితోనే సుమారు 150 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. 2018లో చెరువు కట్టకు బుంగ పడడం వల్ల నీరు మొత్తం వృథాగా పోయింది. 2019లో చెరువుకట్టకు మరమ్మతు చేశారు. మొత్తం మీద ఎన్నో సంవత్సరాల పాటు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడిన ప్రజలు.. ఇప్పుడిప్పుడే ఐక్యంగా ఉంటూ పక్కా ఫలితాలు పొందుతున్నారు.

విదేశాల్లో ఇంటికొక్కరు..

మదన్​పల్లిలో ఇంటికొక్కరు గల్ఫ్​లో ఉపాధి పొందుతున్నారు. 200 మంది దుబాయి, సౌదీ, మస్కట్​, కువైట్​ దేశాల్లోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కుటుంబాలను పోషించుకుంటూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. ఒకరిద్దరు మినహా అందరూ ఇళ్లు నిర్మించుకున్నారు.

గ్రామస్థులు ఐక్యంగా ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమైందని.. యువకుల్లో చైతన్యం వచ్చిందని గ్రామ సర్పంచ్​ శంకర్​గౌడ్​ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం మరచిపోలేమని తెలిపారు.

ప్రజల పట్టుదలతోనే ప్రగతి పనులు ఊపందుకున్నాయని ఎంపీటీసీ ఒడ్డెన్న వెల్లడించారు. గ్రామంతో ఎలాంటి పని చేపట్టాలన్నా అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని.. మున్ముందు కూడా దీన్ని ఇలాగే కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వైభవంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.