నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో ప్రమాదవశాత్తు లారీకి నిప్పంటుకుని దగ్ధమైంది. ఘటనలో లారీ డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. మెండోరా మండలం వెల్గటూర్ నుంచి 23 క్వింటాళ్ల పసుపును విక్రయించేందుకు తీసుకెళ్తున్నారు.
కొత్తపల్లి సమీపంలోకి లారీ రాగానే ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్లు... లారీలో ఉన్న నీటి డబ్బాలతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. అగ్ని కీలలు ఎగిసిపడి... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా... ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు.
రహదారిపై లారీ దగ్ధం కావటం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. పసుపు కాలిపోవటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.