ETV Bharat / state

'ఎల్ఐసీని అంబానీ, అదానీలకు అప్పగించేందుకు కుట్ర' - Nizamabad District Latest News

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఎల్ఐసీలో వాటాలు విక్రయించాలన్న నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్ఐసీ ఉద్యోగుల నిరసన

author img

By

Published : Mar 18, 2021, 5:31 PM IST

బంగారు బాతు లాంటి బ్యాంకులు, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు చౌకగా అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని నిజామాబాద్ బ్రాంచ్ యూనిట్ ఎల్ఐసీ ఉద్యోగుల అధ్యక్షుడు ఆనంద్ ఆరోపించారు. ఎల్ఐసీలో వాటాలు విక్రయించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయడంతో పాలసీదారులు, ఉద్యోగులు నష్ట పోవడమే కాకుండా దేశ ఆర్ధిక రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.

కేంద్రం కుట్రలు తిప్పికొట్టేందుకు చేపట్టిన ఆందోళనకు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ ఎల్ఐసీ ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు శివశంకర్, దేవచారి, చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.