నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్‌లో కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
సీపీఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సీఐటీయూ అన్ని పార్టీలు కలిసి ఉద్యోగులు, కార్మికులపై వ్యతిరేక విధానాలను చూడలేక నిరసన కార్యక్రమాలకు చేపట్టామని నాయకులు తెలిపారు. కార్మికులకు లాక్ డౌన్ సమయంలో రక్షణ లేకుండాపోయిందని మండిపడ్డారు.
కార్మిక చట్టాలని అమలు చేయకుండా 12 గంటలు పని చేయించుకొని.. వారిపై దాడికి దిగుతున్నారని ఆరోపించారు. వెంటనే కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించి కరోనా టెస్టులు చేయాలని కోరారు.