నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి తమ సమస్యలు తీరేవరకు పోరాటం ఆపమని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలోని దీక్ష స్థలి వద్ద ఆర్టీసీ కార్మికులు మౌన దీక్ష చేపట్టారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: ఈనెల 13 నుంచి 19 వరకు నిరసన కార్యక్రమాలు