నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. కవిత తరఫున తెరాస నేతలు మరో మూడు సెట్ల నామపత్రాలు సమర్పించారు. అలాగే నిన్న నామినేషన్ వేసిన భాజపా అభ్యర్థి లక్ష్మీనారాయణ ఈరోజు మరో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరఫున ఇవాళ సీనియర్ నేత షబ్బీర్ అలీతో కలిసి కలెక్టరేట్లో సుభాష్ రెడ్డి నామపత్రాలు సమర్పించారు.
తెరాస తరఫున కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరఫున సుభాష్ రెడ్డి, భాజపా తరఫున పోతాన్కర్ లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేసులో పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు