ETV Bharat / state

దేశంలోనే సక్సెస్​ఫుల్ స్టార్టప్​గా తెలంగాణ : కేటీఆర్​ - Kakatiya sandbox development dialogue

Technology for Impact and Scale: ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నాలుగేళ్లలో నిర్మించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. లక్ష కిలో మీటర్ల పైప్‌లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్​ జిల్లాలో పర్యటించిన కేటీఆర్​.. కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని 'టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్' అనే అంశంపై ప్రసంగించారు.

KTR
KTR
author img

By

Published : Jan 28, 2023, 1:32 PM IST

Technology for Impact and Scale: దేశంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నాలుగేళ్లలో నిర్మించామని.. లక్ష కిలో మీటర్ల పైప్‌లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ విస్తరించామని పేర్కొన్నారు.

KTR Nizamabad Tour: పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడిన కేటీఆర్​.. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుపక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలతో తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు వచ్చాయని తెలిపారు. సాగుకు సాంకేతికతను జోడించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ఇందుకు రైతులు కూడా కలిసిరావాలని కేటీఆర్​ పిలుపునిచ్చారు.

"ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నాలుగేళ్లలో నిర్మించాం. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18వేల కోట్లకు పెరిగింది.గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించాం. 1987లో ఉన్న జీడీపీ ప్రస్తుతం ఉంది. దేశంలో రాజకీయాల వల్ల ఎకానమీలో వృద్ధి చెందడం లేదు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. కేసీఆర్‌ అధికారం చేపట్టాక 24 గంటలు విద్యుత్‌ సరఫరా ఇస్తున్నారు."- కేటీఆర్​, తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.