ETV Bharat / state

Live Video: ఎంపీ అర్వింద్​ పర్యటనలో.. భాజపా కార్యకర్తలపై కత్తులతో దాడి - ఎంపీ అర్వింద్​ కారుపై దాడి

Attack on MP Arvind: నిజామాబాద్ ఎంపీ అర్వింద్​పై దాడి జరిగింది. ఎంపీ వాహనంతో పాటు పలువురి నాయకులు, కార్యకర్తల వాహనాలపై దాడి జరిగింది. ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసం కాగా.. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరి చేతులు విరిగిపోయాయి. రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

mp arvind tour
mp arvind tour
author img

By

Published : Jan 25, 2022, 7:47 PM IST

Attack on MP Arvind: నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఇస్సాపల్లి వద్ద ఎంపీ అర్వింద్​ కారుపై దాడి జరిగింది. అధిక సంఖ్యలో ఎంపీ అర్వింద్ వాహనంతోపాటు ఇతర వాహనాలపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ దాడిలో ఎంపీ అర్వింద్‌ కారుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

కత్తితో దాడి

ఆరుగురు కార్యకర్తల చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. పలువురికి చేతులు విరిగిపోయాయి. ఓ భాజపా కార్యకర్తపై ఓ వ్యక్తి దాడి చేస్తుండగా అతను పరిగెత్తాడు. అయినా వదలకుండా వెంబడించి మరి కొట్టాడు. కింద పడిన ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని నిలువరించారు. అయినా ఆ వ్యక్తి కాళ్లతో తన్నాడు. రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారని... తెరాస కార్యకర్తలతో పోలీసులే దాడి చేయించారని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు. ఇనుప గుండ్ల లాంటి వాటితో తమ కార్యకర్తలను కొట్టారని మండిపడ్డారు.

హత్యాయత్నం కేసులు పెట్టాలి

దాడి ఘటన అనంతరం నేరుగా ఎంపీ అర్వింద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. దాడి విషయంపై అదనపు డీసీపీ వినీత్​కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తెరాస నేతలే తమ కార్యకర్తలతో దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు తెరాసకు సహకరించారన్నారు. దాడి విషయంపై ముందే పోలీస్ కమిషనర్​కు తాను సమాచారం ఇచ్చానని.. వందల మంది గుడిగూడి కత్తులు, రాళ్లు, రాడ్లతో దాడి చేస్తారని తెలిసిందని చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ దాడి చేయించారని ఆరోపించారు. జీవన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో ఓడించి గుణపాఠం చెప్తానన్నారు.

ఎంపీ అర్వింద్​ పర్యటనలో.. భాజపా కార్యకర్తలపై కత్తులతో దాడి

ఇదీ చదవండి : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.