నూతన వ్యవసాయ విధానం వలన రైతులకు జరగబోయే అన్యాయంపై వివరిస్తూ కిసాన్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు పత్తి రైతులవేనని... అలాంటి పంటను ఈ రాష్ట్ర ప్రధానమైన పంటగా నిర్ణయించటంపై సీఎం ఉద్దేశం ఏంటని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం పత్తిపంటను సీసీఎస్ నెత్తినపెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు.
దీనిపై పునరాలోచించి వెంటనే ప్రత్తి పంటపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకుంటే వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన దుయ్యబట్టారు. ముందు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు బంధు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కానీ అనవసరమైన ఆలోచనలు చేస్తూ రైతులను ఆగం చేస్తున్నారని పేర్కొన్నారు