ETV Bharat / state

రైల్వేస్టేషన్ సమీపంలో బండరాయితో మోది హత్య - nizamabad district news today

డిచ్​పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పరిశీలించారు.

killed near dichpally railway station railway a man at nizamabad
రైల్వేస్టేషన్ సమీపంలో బండరాయితో మోది హత్య
author img

By

Published : Feb 9, 2020, 3:03 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వేస్టేషన్ ప్రహరీ గోడకు పక్కన ఉన్న మృతదేహాన్ని స్టేషన్ మాస్టర్ గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఎవరో తలపై బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

మృతుడు డిచ్​పల్లి మండలం మిట్టపల్లి గ్రామవాసి సల్మాన్(48)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆ వ్యక్తి డిచ్​పల్లి మండల కేంద్రంలోని సుగుణ చికెన్ సెంటర్​లో పని చేస్తాడని పోలీసులు పేర్కొన్నారు. అతడు శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పరిశీలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిచ్​పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

రైల్వేస్టేషన్ సమీపంలో బండరాయితో మోది హత్య

ఇదీ చూడండి : తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.