నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో రవాణా, న్యాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల రూ. 60 లక్షలతో నిర్మించిన పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ భవనం, రూ. 16 లక్షలతో చేపట్టిన ఐకేపీ భవనాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వారం రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇక నుంచి కార్యకలాపాలన్నీ బీఆర్కే భవన్ నుంచే..