నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో జరుగుతున్న టీఎన్జీవోస్ క్రీడా పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ... సురేశ్ అనే ఉద్యోగి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే సురేశ్ మృతి చెందాడు.
సురేశ్... డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా 3 నెలల కింద ఉద్యోగంలో చేరాడు. సురేశ్, ఆయన భార్య... నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర సంతాప తెలిపిన టీఎన్డీవో సభ్యులు సురేశ్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.