ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్లో జూనియర్ వైద్యులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఇవాళ జూడాలు వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టారు. వైద్య విద్యలో ఇప్పటి వరకు 85% ప్రైవేటు కళాశాలల సీట్లు, ఫీజులు, నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండేదని... ప్రస్తుతం ఈ బిల్లు ద్వారా 15 నుండి 50 సీట్లు, ఫీజు పెంపు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఇష్టానుసారం కానుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'లోక్సభ సమావేశాల ఆల్టైమ్ రికార్డ్'