ETV Bharat / state

అశ్రునయనాల మధ్య వీరజవాన్​ మహేశ్​ అంత్యక్రియలు

author img

By

Published : Nov 11, 2020, 1:33 PM IST

దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన వీర సైనికుడు మహేశ్​కు కన్నీటి వీడ్కోలు పలికారు. స్వగ్రామం నిజామాబాద్​ జిల్లా వేల్పూర్​ మండలం కోమన్​పల్లిలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, భారీగా తరలొచ్చిన ప్రజలు అమర జవాన్​కు నివాళులు అర్పించారు.

Javan mahesh funeral ceremony in nizamabad district
అశ్రునయనాల మధ్య మహేశ్​కు కన్నీటి వీడ్కోలు

నిజామాబాద్​ జిల్లా స్వగ్రామం నిజామాబాద్​ జిల్లా వేల్పూర్​ మండలం కోమన్​పల్లిలో వీర జవాన్ మహేశ్​ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. పదిన్నర గంటలకు ఇంటి నుంచి అంతిమయాత్ర బయల్దేరగా... మధ్యాహ్నం 12 గంటలకు పూర్తైంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ... మహేశ్​ పాడె మోశారు.

సైనిక వందన అనంతరం మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మహేశ్​ చితికి తండ్రి గంగమల్లు నిప్పంటించగా... సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరి గడియాల్లో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. అశేషంగా తరలి వచ్చిన ప్రజలు జై జవాన్​ జై కిసాన్​ అంటూ నినాదాలు చేశారు.

అశ్రునయనాల మధ్య వీరజవాన్​ మహేశ్​ అంత్యక్రియలు

ఇదీ చదవండి: గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉద్యమం: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.