నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు జీహెచ్‌ఎంసీలో మాదిరిగా వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన