ETV Bharat / state

mission bhagiratha water pipeline Leakage: మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ.. ఉప్పొంగిన నీరు - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద మిషన్ భగీరథ పైప్​లైన్ లీకై(mission bhagiratha water pipeline Leakage) నీరు ఉప్పొంగింది. ఎగిసి పడుతున్న నీటితో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లీకైన నీరు పంటపొలాల్లోకి చేరింది.

mission bhagiratha water pipeline Leakage, pipeline leakage at gannaram in nizamabad
మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ, గన్నారం వద్ద మిషన్ భగీరథ లీకేజీ
author img

By

Published : Sep 28, 2021, 11:06 AM IST

Updated : Sep 28, 2021, 11:43 AM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్‌(mission bhagiratha water pipeline Leakage) లీకైంది. పైప్‌లైన్‌ లీకవడంతో నీరు ఉప్పొంగింది. జాతీయ రహదారిపై పెద్దఎత్తున నీరు ఎగిసిపడుతోంది. నీరు ఉప్పొంగడంతో జాతీయ రహదారి వైపుగా వచ్చే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్ లీకేజీతో పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. మరోవైపు లీకేజీ ద్వారా(mission bhagiratha water pipeline Leakage) ఎగిసిపడుతున్న నీటి దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో బంధిస్తున్నారు. ఆ నీటి పక్కన ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు.

పనులు నత్తనడకన..

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మున్సిపల్ పరిధిలో 2018లో మిషన్ భగీరథ పనులను అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులను నత్తనడకన సాగిస్తున్నారు. మొత్తం రూ.29.5 కోట్లతో 80 కిలో మీటర్ల వరకు పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 50 కిలోమీటర్ల వరకు పైపులైన్లు వేసి, సుమారు 60 శాతం పనులు పూర్తి చేశారు. నీటి సరఫరా కోసం పట్టణంలో మూడు కొత్త ట్యాంకుల నిర్మాణంతో పాటు ఓ పాత ట్యాంకును వినియోగించుకుంటూ నాలుగు ట్యాంకుల ద్వారా పట్టణ ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే భగీరథ పనులు జాప్యం కావడంతో ప్రజలకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో నత్తనడకన సాగుతున్న మిషన్ భగీరథ పనులతో పట్టణ ప్రజలు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు.

తాగు నీటి లీకేజీలు

మెట్​పల్లిలోని 26 వార్డుల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పురపాలక అధికారులు, భగీరథ అధికారుల సమన్వయ లోపంతో పట్టణ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. జరుగుతున్న పనుల వద్ద అధికారులెవరు ఉండకపోవడంతో గుత్తేదారు ఇష్టం వచ్చినట్లు పైపులను వేస్తున్నారు. గతంలో ఉన్న తాగునీటి పైపులైన్లకు పగుళ్లు వచ్చేలా పనులు చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి తాగునీటి లీకేజీ(mission bhagiratha water pipeline Leakage) అవుతుంది. ఇళ్లలోకి వచ్చే తాగునీరు సరిగా రాక ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా లీకేజీ నీరంతా మురుగు కాలువలలో కలుస్తున్నాయి. రోడ్లన్నీ నీటితో నిండి బురదమయంగా మారి ప్రజలు నడిచేందుకు కూడా వీలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

నెలల తరబడి లీకేజీలు..

నెలల తరబడి లీకేజీలు అవుతున్నా... పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రభుత్వం అందించే శుద్ధ నీరు దేవుడెరుగు కానీ... నిత్యం వచ్చే తాగునీరు సరిగా అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా ఏ వార్డు చూసినా తాగునీటి లీకేజీలతోనే వీధులు దర్శనమిస్తుంటాయి. పైప్ లైన్ పనులు అలా ఉంటే పైపులు వేసిన తర్వాత మిగిలిన పైపులను ఓ పక్కన భద్రపరచడం లేదా తీసుకెళ్లాల్సిన గుత్తేదారులు... వాటిని ఎక్కడపడితే అక్కడ రోడ్లపైనే వేసి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి పైపులైన్లు లీకేజీలు(mission bhagiratha water pipeline Leakage) కాకుండా, పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

: మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ

ఇదీ చదవండి: Heavy Rain in Telangana : తెలంగాణ అతలాకుతలం.. హైదరాబాద్​ జలమయం... నేడూ భారీ వర్షాలు

Last Updated : Sep 28, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.