ETV Bharat / state

'స్పైస్​ బోర్డుతో పసుపు రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది?' - latest news on How to do justice to the Yellow Farmers with the Spice Board

నిజామాబాద్​ రైతులకు కావాల్సింది స్పైస్​ బోర్డు కాదని..పసుపు బోర్డని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పేర్కొన్నారు. స్పైస్​ బోర్డు వల్ల పసుపు రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు.

How to do justice to the Yellow Farmers with the Spice Board
'స్పైస్​ బోర్డుతో పసుపు రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది?'
author img

By

Published : Feb 6, 2020, 12:43 PM IST

నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు కార్యాలయం పెట్టినంత మాత్రాన పసుపు రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశంలో 16 చోట్ల ఈ స్పైస్​ బోర్డు కార్యాలయాలు ఉన్నాయని.. అక్కడా రైతులకు మద్దతు ధర రావడంలేదని మంత్రి గుర్తు చేశారు.

వరంగల్‌లో దాదాపు 20 సంవత్సరాలుగా, సికింద్రాబాద్‌లో 30 సంవత్సరాలుగా స్పైస్ బోర్డు కార్యాలయాలున్నా.. పసుపు రైతుకు మద్దతు ధర రూ.15 వేలు ఎందుకు దక్కడం లేదన్నారు. పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానంత వరకు రైతుకు మేలు జరగదని ఈ కార్యాలయాల చరిత్ర చెబుతోందన్నారు.

దశాబ్దాలుగా రైతులు కోరుతున్నది పసుపుబోర్డు మాత్రమేనని మంత్రి గుర్తు చేశారు. వారి డిమాండ్ మేరకు కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్ రాసిచ్చి.. ఇప్పుడు స్పైస్ బోర్డు తీసుకువచ్చారని విమర్శించారు.

'స్పైస్​ బోర్డుతో పసుపు రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది?'

ఇవీ చూడండి: రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.