నిజామాబాద్ నగరంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వినాయక్ నగర్, పెద్దబజార్, గాజులపేట్, వర్ని రోడ్డు ఏరియాల్లో చిన్నారులు హోలీ వేడుకల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. ఆనందంగా గడిపారు.
పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీ వేడుకలను నేడు జరుపుకుంటుండగా.. ఎక్కువ మొత్తం ప్రజలు రేపు జరుపుకోనున్నారు.