నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోసంగి కాలనీలో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. అందులో కాశయ్య అనే వ్యక్తి 20 నిమిషాల్లోనే ఫుల్ బాటిల్ విస్కీ తాగుతానని తన ఇద్దరు స్నేహితులతో పందెం కాశాడు. అప్పటికే సగం సిసా మద్యం తాగిన కాశయ్య... పందెం కోసం ఫుల్ బాటిల్ తాగారు. ఫలితంగా స్పృహ తప్పి పడిపోయాడు.
పోలీసుల అదుపులో కాశయ్య మిత్రులు...
బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే చనిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు కాశయ్య పాత ఇనుప సామాను అమ్ముకుంటూ జీవించేవాడని పేర్కొన్నారు. మృతునికి భార్య... ముగ్గురు కొడుకులు... ఒక కూతురు ఉందని సమాచారం. ఘటనతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి : అక్కను అనుమానిస్తున్నాడని బావను చంపిన బావమరిది