ETV Bharat / state

Heavy Rains in Telangana Today : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు - నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం

Heavy Rains in Telangana Today : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వానలు పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా జోరు వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆగస్టులో మొహం చాటేసిన వరుణుడు ఆలస్యంగానైనా రావడంతో పంటలకు ప్రాణం పోసినట్లైందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Heavy Rains in Hyderabad Today
Heavy Rains in Telangana Today
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 10:33 AM IST

Updated : Sep 4, 2023, 1:15 PM IST

Heavy Rains in Telangana Today ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

Heavy Rains in Telangana Today : మొన్నటి వరకు కనిపించకుండాపోయిన వరుణుడు.. గత రెండు రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కురుస్తోన్న వర్షాల(Telangana Rains)తో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వీటికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరో 3 రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టుల గేట్లు తెరచి.. వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని.. ముంపు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Rain Alerts in Telangana : రాగల 48 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులు ఆరెంజ్​ హెచ్చరికలు జారీ

Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మియాపూర్, చందానగర్‌, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలనగర్‌ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో నానా అవస్థలు పడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ(GHMC) సిబ్బంది.. ఎక్కడికక్కడ మ్యాన్‌హోళ్లను తెరచి వరద నీటిని మళ్లిస్తున్నారు.

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే

Telangana Rain Alert 2023 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా(Nizamabad Rains)పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం చీమనుపల్లిలో అత్యధికంగా 113 మి.మీ. వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగానూ వానలు దంచికొడుతున్నాయి. జుక్కల్-బస్వాపూర్ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు వర్షం వల్ల కోతకు గురవ్వడంతో ఆ మార్గం గుండా ప్రయాణం సాగించలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Nizamabad Rains Today : నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కొడుతున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం తడిచి ముద్దయింది. మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీటి(Jagtial Rains)తో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మురికి కాలువలు నిండి.. మురుగు నీరు, వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్‌పల్లి పట్టణంలోని చైతన్య నగర్, సాయిరాం కాలనీ, హనుమాన్ నగర్, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, కోరుట్ల లోని ఆదర్శనగర్, ముత్యాలవాడ, ప్రకాశం రోడ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలకు పైనుంచి పెద్ద ఎత్తున వరద నీరు వీధుల్లో చేరింది. మోకాలి వరకు నీరు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం వస్తే వరద నీటితో నరకం చూస్తున్నామని.. ఏ అధికారి వచ్చినా తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారే తప్ప, శాశ్వత పరిష్కారాలు చూపడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Viral Video Electricity Restoration by Swimming in Pond : విద్యుత్ ఉద్యోగుల సాహసం.. చెరువులో ఈదుకుంటూ వెళ్లి 11 కేవీలైన్​ విద్యుత్ పునరుద్ధరణ

భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP Floods), నిర్మల్‌ జిల్లాలోని కడెం జలాశయాల(Kadem Projects Gates Opened)కు వరద నీరు పోటెత్తింది. ఎస్సారెస్పీలోకి 24 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కడెం జలాశయలోకి 13,320 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,090.8 అడుగులకు చేరింది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696.520 అడుగులుగా ఉంది.

Heavy Rain Forecast for Telangana : రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. హైదరాబాద్​లో రాత్రి నుంచి వర్షం

Last Updated : Sep 4, 2023, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.