నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం వేకువజామున కురిసిన వర్షాలకు... వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దర్పల్లి మండలం వాడి వాగు వంతెనపై నుంచి నీరు ప్రవహించి.. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిరికొండ మండలం కొండూర్ గ్రామం గతంలోనే తెగిపోయిన వంతెన వద్ద వాగు ప్రస్తుతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి చెరువు అలుగు భారీగా పారుతోంది. ఇక్కడా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీగా కురిసిన వర్షాలు వరి రైతులకు ఆనందాన్ని తీసుకురాగా... ఆరుతడి రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. సోయా పంట కోత దశలో ఉన్నందున నీరు నిలిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతులు సైతం వరుసగా కురుస్తున్న వర్షాలతో నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు - జిల్లావ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు
నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లోని వంతెనలు తెగిపోయి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి.
![జిల్లావ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4476308-202-4476308-1568791598821.jpg?imwidth=3840)
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం వేకువజామున కురిసిన వర్షాలకు... వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దర్పల్లి మండలం వాడి వాగు వంతెనపై నుంచి నీరు ప్రవహించి.. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిరికొండ మండలం కొండూర్ గ్రామం గతంలోనే తెగిపోయిన వంతెన వద్ద వాగు ప్రస్తుతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి చెరువు అలుగు భారీగా పారుతోంది. ఇక్కడా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీగా కురిసిన వర్షాలు వరి రైతులకు ఆనందాన్ని తీసుకురాగా... ఆరుతడి రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. సోయా పంట కోత దశలో ఉన్నందున నీరు నిలిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతులు సైతం వరుసగా కురుస్తున్న వర్షాలతో నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TAGGED:
heavy rain in nizamabad dist