నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నర్సిరోడ్డు లోని హనుమాన్ ఆలయం, రాకసిపేట్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పువ్వులతో ఆంజనేయ స్వామికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఆలయ సిబ్బంది అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి : హనుమాన్ పూజల్లో మంత్రి తలసాని శ్రీనివాస్