.
కుస్తీ పోటీల్లో కండలు తిరిగిన దేహంతో... కొండలనైనా పిండి చేసే బలంతో ఉండే మల్లయోధులు గుర్తొస్తారు. ఉడుం పట్లతో ప్రత్యర్థులను మట్టి కరిపించడం చూస్తుంటాం. కానీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన పోటీల్లో ఓ దివ్యాంగుడు ఒంటి చేత్తో విజయాన్ని అందుకుని అందర్నీ ఆకట్టుకున్నాడు.
ఆత్మవిశ్వాసమే బలం
మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా కర్కెల్లి గ్రామానికి చెందిన మల్లయోధుడు గణేశ్... ఒంటి చేత్తో కుస్తీపోటీలో తలపడి.. గెలుపొందడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ప్రమాదంలో చేయి కోల్పోయినా కుస్తీ పోటీలపై మక్కువతో... ఆత్మస్థైర్యాన్ని విడవక సాధన చేస్తూ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా చేశాడు.