ETV Bharat / state

నిజామాబాద్​లో వడగండ్ల వర్షం.. భాగ్యనగరంలో తేలికపాటి వర్షం - నిజామాబాద్​లో వడగండ్ల వర్షం

Rain In Hyderabad: మళ్లీ రాష్ట్రంలో వడగండ్ల వర్షం పడింది. నిజామాబాద్​ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడి.. రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అలాగే నగరంలోని పలు ప్రదేశాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

rain affect
rain affect
author img

By

Published : Mar 25, 2023, 10:06 PM IST

Rain In Hyderabad: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్​లోని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే పడిన అకాల వర్షాలతో మామిడి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు భారీగా నష్టపోయి.. రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. ఇప్పుడు మరోసారి వర్షాలు అంటే రైతన్నలు కోలుకునే పరిస్థితి లేదు.

తాజాగా ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు రెండు రోజులు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పినట్లుగానే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పాతబస్తీ, చార్మినార్​, చాంద్రాయణగుట్ట, బార్కస్​, ఉప్పుగూడ, బహదూర్​పురా, యాకుత్​పురా ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే రాష్ట్రంలోని మరికొన్ని ప్రదేశాల్లో వర్షం పడింది.

నిజామాబాద్​ జిల్లాలో వడగండ్ల వర్షం: నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి, చీమన్​పల్లి గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. వర్షం కురుస్తుందన్న ఆనందం పొందాలో.. ఈ అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతున్నామనే బాధ పడాలో తెలియని స్థితిలో రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వరి పంటలు 15రోజులలో కోతకు వచ్చే దశలో ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు. ఇంతలోనే ఈ మాయదారి వర్షం రావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్లు, ఈదురుగాలులు వల్ల ధాన్యం నేల రాలి నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈదురు గాలులు, వడగండ్ల వల్ల పంట మొత్తం నాశనం అవుతుందని కన్నీటిపర్యాంతం అవుతున్నారు.

రెండు రోజులు వర్షాలు: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షంతో పాటు ఈశాన్య తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఎకరాకు రూ.10వేలు పరిహారం ప్రకటించిన సీఎం: అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్​, మహబూబాబాద్​, కరీంనగర్​ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. మామిడి, వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్​ పర్యటించి పంటకు పరిహారంగా ఎకరాకు రూ. 10వేలు ఇస్తానని హామీ ఇచ్చి.. వెంటనే రూ. 228కోట్లు విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు అంటే రైతులు.. ఎటువైపు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.