మునుపటి సీజను మాదిరిగానే ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొన్నిచోట్ల కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అయితే కొనుగోళ్లు పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. సోమవారం వరకు 1,033 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. అవసరాల మేరకు జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవటంతో ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు పెద్దఎత్తున కొనుగోళ్లు చేపట్టారు. సాధారణంగా తేమ శాతం తగ్గేంతవరకు రోజులు, వారాల తరబడి ఎదురుచూడాలి. అకాల వర్షాలు కురిస్తే ధాన్యాన్ని కాపాడుకోవడం తలకుమించిన భారమవుతుంది. ఈ భయాన్నే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు (Grain traders cheating farmers). పొలాల వద్దే పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపడుతున్నారు. పంటను కాపాడుకోలేక.. మరో దారిలేక వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకుంటున్నారు.
ఎకరాకు రూ.14 వేలే మిగిలింది
బీపీటీ రకం వేశాను. గడిచిన సీజనులో ఎకరాకు 32 క్వింటాళ్లు వస్తే ఈ దఫా 28 క్వింటాళ్లు వచ్చింది. గత సీజనుతో పోలిస్తే ఎకరాకు రూ.5 వేల నుంచి అయిదున్నర వేల వరకు పెట్టుబడి పెరిగింది. ఆరు నెలలు కష్టపడి వరి సాగు చేస్తే ఎకరాకు రూ.14 వేలే మిగిలింది. వ్యాపారులకు క్వింటా రూ.1,550 చొప్పున విక్రయించాం. - పాలచర్ల శ్రీరామతారకం, సత్యనారాయణపురం
క్వింటాకు రూ.1,550 నుంచి 1,620...
‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,960, సాధారణ రకానికి క్వింటాకు రూ.1,940గా కేంద్రం ధర నిర్ణయించింది. ప్రభుత్వం ఆ ధరకు కొనుగోలు చేయాలంటే ధాన్యంలో తేమ 17 శాతానికి మించకూడదు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు స్థలం లేదు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియదు. అప్పటిదాకా ధాన్యాన్ని భద్రపరచుకోవడం కష్టం. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాల్లో ఇంకా తడి ఆరలేదు. అక్కడ నిల్వ చేస్తే ధాన్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధాన్యంలో తేమ శాతం 20 నుంచి 22 వరకు ఉంటోంది. ఆ పేరు చెప్పి ధరలను అడ్డంగా కోసేస్తున్నారు. సన్నాలైనా, దొడ్డురకం ధాన్యమైనా క్వింటాకు రూ.1,550 నుంచి రూ.1,620 మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు తరుగు పేరుతో క్వింటాకు నాలుగు నుంచి నాలుగున్నర కిలోల వరకు కోత పెడుతున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా రుద్రూరులో పొలాల వద్దే ధాన్యం కొనుగోళ్లు
ఎకరాకు రూ.14 వేలే మిగిలింది
బీపీటీ రకం వేశాను. గడిచిన సీజనులో ఎకరాకు 32 క్వింటాళ్లు వస్తే ఈ దఫా 28 క్వింటాళ్లు వచ్చింది. గత సీజనుతో పోలిస్తే ఎకరాకు రూ.5 వేల నుంచి అయిదున్నర వేల వరకు పెట్టుబడి పెరిగింది. ఆరు నెలలు కష్టపడి వరి సాగు చేస్తే ఎకరాకు రూ.14 వేలే మిగిలింది. కోతల సమయంలో వర్షాలు పడటంతో భద్రపరచుకోవటం కష్టమైంది. గత్యంతరం లేక వ్యాపారులకు క్వింటా రూ.1,550 చొప్పున విక్రయించాం.- పాలచర్ల శ్రీరామతారకం, సత్యనారాయణపురం
పది రోజులైనా కొనలేదు
ధాన్యం ఇక్కడ ఆరబెట్టి పది రోజులు అవుతోంది. రెండు రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోళ్లు ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. వర్షం వస్తే పడిన కష్టం అంతా నీటి పాలవుతుంది. ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గింది. వ్యాపారులు తక్కువ ఇస్తున్నారు. వాళ్లకు విక్రయిస్తే నష్టం వస్తుంది. ప్రభుత్వానికి అమ్మితే నాలుగు రూపాయలు మిగులుతాయని ఎదురుచూస్తున్నాను. - తుర్కి రవి, రుద్రారం.
ఇదీ చూడండి: పోటెత్తిన ధాన్యం.. చేతులెత్తేసిన మిల్లర్లు!