నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జె.సి)లో పనిచేసే ఉపాధ్యాయుడు కరోనా కాటుకు బలయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.
ఆయనకి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
ఇదీ చదవండి: ఘరానా మోసగాళ్ల ముఠా ఆటకట్టు.. పీడీ చట్టం నమోదు