ETV Bharat / state

కరోనా మృతదేహాల తరలింపులో నిర్లక్ష్యం.. ప్రభుత్వం సీరియస్‌

కరోనా రోగుల మృతదేహాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మృతదేహాల తరలింపు మార్గదర్శకాలను పాటించడంలేదు. నిజామాబాద్ సర్వజన ఆసుపత్రిలో ఓ కరోనా రోగి మృతదేహాన్ని ఆటోలో తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు.

corona
corona
author img

By

Published : Jul 12, 2020, 7:03 AM IST

నిజామాబాద్‌ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ రోగుల మృతి ఘటనకు మరో వివాదం తోడైంది. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాల తరలింపులో కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేశారు. ప్రభుత్వ అంబులెన్సులో తరలించి ఖననం చేయాల్సిన చోట.. ఆటో, ప్రైవేటు అంబులెన్స్‌ల్లో తరలించారు. వీటి ఖర్చులు బాధిత కుటుంబాలే భరించాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఆటోలో మృతదేహం తరలింపు చిత్రం శనివారం స్థానిక‘ఈనాడు’లో ప్రచురితమైంది. ఈ చిత్రంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. సర్కారు తీవ్రంగా పరిగణించింది.

బాధ్యులపై చర్యలు

బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లందరూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సాయంత్రానికల్లా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం మార్చురీ సిబ్బందికి తాఖీదులిచ్చారు.

మరో వివాదం

నిజామాబాద్‌ సర్వజన ఆసుపత్రిలో గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేలోపు ముగ్గురు కరోనా, ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఆక్సిజన్‌ అందక చనిపోయారంటూ మృతుల కుటుంబీకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కరోనాతో చనిపోయిన మృతదేహాల తరలింపులో కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించలేదనే మరో వివాదం తెరపైకి వచ్చింది. మృతదేహాల తరలింపునకు మృతుల బంధువులతో పాటు పోలీసులు శుక్రవారం గంటల తరబడి వేచి చేశారు. చివరకు అంబులెన్సు కోసం పోలీసులు ఆసుపత్రి అధికారులను సంప్రదించగా వారు ఇన్‌ఛార్జి నంబరు ఇచ్చారు. ‘కొవిడ్‌ ప్రొటోకాల్‌లో ఒక్కటే అంబులెన్సు ఉంది. డ్రైవర్‌ విధులకు రాలేదు. నేనేమీ చేయలేను’ అని సదరు ఇన్‌ఛార్జి చేతులెత్తేశారు.

నిబంధనలకు విరుద్ధంగా

ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వ అంబులెన్స్‌లోనే కరోనా మృతులను తరలించాలి. అధికారులు స్పందించకపోవడంతో బాధితులు ప్రైవేటు అంబులెన్సును మాట్లాడుకున్నారు. మార్చురీ సిబ్బంది వాటిల్లో శవాలను తీసుకెళ్లి ఖననం ప్రకియ పూర్తి చేశారు. ఒక మృతదేహాన్ని భీమ్‌గల్‌ మండలానికి తరలించాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులు పోలీసులు, మార్చురీ సిబ్బందిని వేడుకోవడంతో ఆటోలో తరలించారు. అయితే సొంతూరుకు తరలించకుండా జిల్లా కేంద్రంలోని శ్మశానవాటికలోనే ఖననం చేశారు.

ఒత్తిడిచేసి ఆటోలో తీసుకెళ్లారు

ఆటోలో కరోనా మృతుడిని తరలించిన చిత్రం ‘ఈనాడు’లో ప్రచురితం కావడంతో అధికారులు శనివారం మధ్యాహ్నం కమిటీ వేశారు. సాయంత్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చారు. రోగి బంధువులు తమకు తెలిసిన వారి ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్తామని మార్చురీ సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలా చేశారని కమిటీ పేర్కొన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు తెలిపారు. మార్చురీ సిబ్బందికి తాకీదులిచ్చామని, పూర్తి నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

-ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.