ETV Bharat / state

భూ దస్త్రాల ప్రక్షాళన ఓ పట్టాన తేల్చరు - PASSBOOKS

కొత్త పాసు పుస్తకాలివ్వడం లేదు.. తప్పులు సవరించడం లేదు... పార్ట్‌-బీ సమస్యలు త్వరగా పరిష్కరించడం లేదు.. ‘భూ’వెతలు తీర్చండని కర్షకులు వేడుకొంటున్నా కనికరించేవారు కరవయ్యారు. ఉమ్మడి జిల్లాలో భూదస్త్రాల ప్రక్షాళన కొందరు రైతులకు కష్టాలు తెచ్చి పెట్టింది.

భూ దస్త్రాల ప్రక్షాళన ఓ పట్టాన తేల్చరు
author img

By

Published : Jul 17, 2019, 12:33 PM IST

భూదస్త్రాల ప్రక్షాళన త్వరితగతిన పూర్తి చేసి నవీకరించిన దస్త్రాలను రైతులకు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సేద్యం పనులు పక్కనపెట్టి పాసు పుస్తకాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. కొత్త పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులు సవరించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో అన్ని సక్రమంగానే ఉన్నా పట్టాలు అందడం లేదు. భూ విస్తీర్ణాల్లో తేడాలను సైతం సరిదిద్దకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

బ్యాంకు రుణాలకు దూరం

వరుసగా జరిగిన ఎన్నికల పుణ్యమాని పాసు పుస్తకాలు అందజేయాల్సిన బాధ్యతను రెవెన్యూ అధికారులు అటకెక్కించారు. ‘ధరణి’ వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదంటూ కొన్నాళ్ల పాటు ప్రక్షాళనను పక్కనెట్టారు. ఇలా వివిధ కారణాలతో పట్టాదారు పాసు పుస్తకాలు అందక రైతులు రైతుబంధు సాయాన్ని పొందలేకపోతున్నారు. మరోవైపు బ్యాంకు రుణాలూ అందుకోలేని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నిర్వాకం వల్ల వివాదాలు పెరిగాయన్న అపవాదు ఉంది. దస్త్రాల నవీకరణ పూర్తయిన రైతులకు ఇప్పటికే రెండు విడతలుగా పెట్టుబడి సాయం అందగా ఈ ఖరీఫ్‌లో మరో విడత అందుకొంటున్నారు.

తప్పుల సవరణలపై పట్టింపు కరవు

పార్ట్‌-బీలో నమోదు చేసిన ఖాతాలు, ఆధార్‌ నమోదు చేయని ఖాతాలతో పాటు డిజిటల్‌ సంతకాలు కాని దస్త్రాల ప్రగతిని మాత్రమే రెవెన్యూ అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. వీటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. కొత్తగా జారీ చేసిన పాసు పుస్తకాల్లోని తప్పుల సవరణను పరిగణనలోకి తీసుకోవడం లేదు.

సాంకేతిక కారణాలతో..

ప్రక్షాళన ప్రారంభించిన సమయంలో రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బంది ఎల్‌ఆర్‌యూపీ(ల్యాండ్‌ రికార్డ్స్‌ అప్‌డేట్‌ ప్రాజెక్టు) సైట్‌లో ఇష్టం వచ్చిన తీరుగా భూ వివరాలను నమోదు చేశారు. దీనికి అనుగుణంగానే పాసు పుస్తకాలు ముద్రించడంతో తప్పులు దొర్లాయి. వీటిని సవరించకుండా ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌లో ఎల్‌ఆర్‌యూపీ సైట్‌ వివరాలను పొందుపర్చింది. ఇప్పుడు వాటి సవరణకు ధరణి వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.

షేత్వారీకి మించి..

గతంలో రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడి ఆర్‌ఎస్‌ఆర్‌(రెవెన్యూ షేత్వారీ)కు మించి భూ విస్తీర్ణాలకు సంబంధించిన పాసు పుస్తకాలు జారీ చేశారు. వీటి వల్లనే ప్రస్తుతం సమస్యలు తలెత్తుతున్నాయి. భూదస్త్రాల ప్రక్షాళనను ప్రారంభించిన సమయంలో పూర్తిస్థాయిలో అవగాహన లేని సిబ్బంది పాత దస్త్రాల్లో ఉన్నట్లుగానే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మొదట పట్టాలు అందుకొన్న రైతులకు క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి మించి నమోదయింది. ఇది వాస్తవ సాగుదారు పాసు పుస్తకాల జారీకి అడ్డంకిగా మారింది.

ఇలా చేస్తేనే మేలు

జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో అధికారులు పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి కమతాల(సర్వే నంబర్ల) వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి భూ వివాదాలను పరిష్కరించారు. ఇదే విధానాన్ని ఇక్కడా అవలంబిస్తేనే సమస్యకు పరిష్కారం దొరకనుంది. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో పాలనాధికారులు ప్రతిరోజు ఉదయం గంట పాటు ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహించి యుద్ధప్రాతిపదికన దస్త్రాల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు.

ఇవీ చూడండి: 'కర్ణాటకీయం'పై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.