ETV Bharat / state

అరుదైన చికిత్స చేసి.. క్యాన్సర్​ బారి నుంచి కాపాడి..! - Gangadara rare operation

Government doctors who performed rare surgerie: ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోరు అని చాలా మంది అనుకొంటూ ఉంటారు. అలానే అనుకోంటే తప్పుగా ఆలోచించినట్టే. నిజామాబాద్​ జిల్లాలోని ఒక అరుదైన శస్త్ర చికిత్స ప్రభుత్వ ఆస్పత్రిలో చేశారు. ఇందులో డాక్టర్లు విజయం వంతంగా ఆపరేషన్​ చేశారు.

rare surgerie
అరుదైన శస్త్ర చికిత్స
author img

By

Published : Dec 22, 2022, 9:45 PM IST

ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.10 లక్షల విలువ చేసే అరుదైన శస్త్ర చికిత్స చేసి వ్యక్తిని క్యాన్సర్ బారిన పడకుండా వైద్యులు కాపాడారు. ఈ ఆపరేషన్​ గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్​ వివరాలను వెల్లడించారు. నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలానికి చెందిన గంగాధర్​(40) శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సంప్రదించగా.. ఆమ్లో బ్లాష్టోమా సంబంధిత కణతి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

కంటికి కింద దవడపై లోపలి భాగంలో ఈ ఆమ్లో బ్లాష్టం శస్త్ర చికిత్స చేశారు. ఈ చికిత్సలో మక్సిల్లో ఫేషియల్, ఈఎన్​టీ, దంత వైద్య నిపుణులు, అనస్తేషియాకు సంబంధించిన వైద్యులు సుమారు 5 గంటలు పాటు శ్రమించారన్నారు. ఈ చికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.