ETV Bharat / state

అది తేలిస్తేనే.. కేసీఆర్ చెప్పిన పంటలేస్తరట!

పంటలు వేసే సమయం ఆసన్నమైంది... రైతులు పొలాలు సిద్ధం చేస్తున్నారు... కానీ ఏ పంట వేయాలో పలుపోక తలలు పట్టుకుంటున్నారు. తీరా... ప్రభుత్వాలు సూచించిన పంటలు వేసిన తర్వాత గిట్టుబాటు ధర రాకపోతే ఎలా అని ఆందోళనతో ఉన్నారు. ముందుగానే మద్దతు ధర ప్రకటిస్తే... ప్రభుత్వం సూచించిన పంట వేసేందుకు సిద్ధమంటున్నారు ఇందూరు రైతులు.

Regulated cultivation
Regulated cultivation
author img

By

Published : Jun 7, 2020, 4:19 PM IST

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. యాసంగిలో దొడ్డు రకాలు, వానాకాలంలో సన్న, దొడ్డు రకాలు పండిస్తారు. ఏ రకం వడ్లకైనా ప్రభుత్వ మద్దతు ధర ఒక్కటే కావటం వల్ల రైతులు సన్న బియ్యం కంటే దొడ్డురకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే...

తాజాగా ప్రభుత్వం సన్నరకాలను సాగుచేయాలని చెబుతుండడం వల్ల నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2019–21లో వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ. 1,835 కాగా... మిల్లర్లు సన్నవడ్లను రూ. 2వేల దాకా కొన్నారు. సన్నాలనే ఎక్కువగా పండిస్తే మిల్లర్లు రేటు తగ్గిస్తారనడంలో అనుమానం లేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు రాష్ట్ర సర్కారు ముందుగా గిట్టుబాటు ధర నిర్ణయించాలని... అప్పుడే వాటిని సాగుచేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.

ఏం చేయాలో సమజైతలేదు…

"ఈసారి మక్కలు వేయద్దని సర్కార్‌‌ చెప్తాంది. పత్తి సాగు చెద్దామంటే ఎర్ర నేలలో దిగుబడి రాదు. ప్రభుత్వం పెట్టిన నిబంధనతో ఏం చేయాలో సమజైతలేదు. ఈ విషయంలో సర్కారు మరోసారి ఆలోచన చేయాలె. ఎవరి ఇష్టమైన పంట వారు పండించుకునేలా చూడాలె" అంటూ... ఓ రైతు కోరాడు.

నష్టపోతే ఎవరు బాధ్యులు?

"పంటలు వేసుకునే స్వేచ్ఛ రైతులకే ఉండాలె. కాదు, కూడదు ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలంటే మాత్రం ముందుగా గిట్టుబాటు ధర ప్రకటించాలె. ఆ రేటుకే కొనాలె. అంతే తప్ప ప్రభుత్వం చెప్పిన పంట వేసి, తీరా రేటు లేక నష్టపోతే ఎవరు బాధ్యులు?" అంటూ మరో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు.

సర్కార్‌‌ ఆలోచించాలె...

"చాలాకాలంగా వరి పంటే పండిస్తున్నం. ఇప్పడు కూడా అదే వేస్తం. మా భూముల్లో మక్కలు, పత్తి, కంది వేస్తే పండవు. కానీ సర్కారు సహకరిస్తలేదు. విత్తనాలు, మందులు ఇస్తలేదు. ఇప్పటికైనా ఆలోచించాలె" అంటూ ఇంకో రైతు వేడుకున్నాడు.

ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశ పెట్టగా... రైతులు ఏ పంట వేయాలో అర్థం కాక.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయించిన పంటనే వేయాలంటే... ముందుగానే మద్దతు ధర ప్రకటిస్తేనే వేస్తామని... లేనిపక్షంలో తమకు వీలైన పంట వేసుకుంటామంటున్నారు ఇందూరు రైతులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.