నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రాగా.. మహారాష్ట్ర నుంచి గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున నిజామాబాద్ వైపు ప్రవహిస్తున్నది. వరద నీరు పోటెత్తడం వల్ల కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం నీట మునిగింది. గోదావరి పరవళ్లు తొక్కతూ.. నీటి ప్రవాహం వంతెన పైభాగం వరకు చేరింది. గోదావరిలో నీటి ప్రవాహం పెరగగా.. చుట్టు ప్రక్కల గ్రామాల వారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసి, గంగమ్మకు తెప్పలు వదులుతున్నారు. గోదావరి ఉగ్రరూపం వీక్షించడానికి పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.
ఇదీచూడండి.. హైదరాబాద్లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్