నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన ఇంటర్ విద్యార్థిని మహిజ పాల్గొని సత్తా చాటింది. పురుషుడితో తలపడి 5 నిమిషాల్లోనే చిత్తు చేసి రూ.5వేలు గెల్చుకుంది. తండ్రి వద్దనే తర్ఫీదు పొందానని, సుమారు 200 పైగా పోటీల్లో తలపడినట్లు తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటాలనేదే తన ఆకాంక్షని వెల్లడించింది.
ఇవీ చూడండి:"ఇదో ట్రెండ్ అయిపోయింది"