ETV Bharat / state

గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల తీరుపై గంగపుత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను గ్రామ బహిష్కరణ చేయడం పట్ల వీడీసీపై నిజామాబాద్ జిల్లా గంగపుత్ర చైతన్య సమితి మండిపడింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్​ ముట్టడికి గంగపుత్ర చైతన్య సమితి పిలుపునిచ్చింది.

వీడీసీ ఆగడాలు నశించాలి : చైతన్య సమితి
వీడీసీ ఆగడాలు నశించాలి : చైతన్య సమితి
author img

By

Published : Jul 12, 2020, 11:20 PM IST

Updated : Jul 13, 2020, 12:57 AM IST

వీడీసీ ఆగడాలు నశించాలి : చైతన్య సమితి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామంలో గంగపుత్రులపై గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరణ విధించింది. వీడీసీ చేస్తున్న బెదిరింపులను ఇటీవలే గంగపుత్ర చైతన్య సమితి సభ్యులు ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్, మత్స్య శాఖ దృష్టికి తీసుకెళ్లామని సంఘం నేతలు వెల్లడించారు. ఫలితంగా అధికారులు గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనధికారికంగా గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై వారిని మందలించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. ఫలితంగా గంగపుత్రులపై గ్రామ బహిష్కరణ ఎత్తివేసినట్లు గ్రామ చావిడి వద్ద మైక్ ద్వారా ప్రకటింపజేశారు. కానీ అంతర్గతంగా తమకు గ్రామంలో ఎవరూ సహకరించట్లేదని సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు..

గత నాలుగేళ్లుగా తాము చాలా గ్రామాల్లో మత్స్యకారులపై వీడీసీ బెదిరింపులకు దిగుతోందని చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అల్గోట్ రమేశ్ గంగపుత్ర ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గంలోని చిట్టాపూర్​లోనూ ఏడాదికి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మండిపడ్డారు. వీడీసీ చెప్పిన రేటుకే చేపలు విక్రయించాలని హుకుం జారీ చేస్తున్నారని.. తమపై గ్రామ అభివృద్ధి కమిటీ పెత్తనం చెలాయిస్తోందన్నారు. కమిటీ చెప్పిన ధరకే చేపలు విక్రయించాలని.. లేకుంటే సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. చేపలు గ్రామంలో తప్ప ఇతర ప్రదేశాాల్లో అమ్మకూడదని వీడీసీ చెప్పడమేమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాము వీడీసీని వ్యతిరేకించినందుకు గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారన్నారు. తమకు అన్యాయం జరిగినందునే కమిటీపై అధికారులను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు.

త్వరలోనే మానవ హక్కుల కమిషన్​కు..

జిల్లాల్లోని చాలా మండల కేంద్రాల్లో ఇదే తీరు కొనసాగుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో, దర్పల్లి మండలం కేశాపూర్, వేల్పూర్ మండలం అంక్సాపూర్, కమ్మర్​పల్లి మండలం నాగపూర్, బషీరాబాద్ నందిపేట్ మండలంలోని తల్వేద, వెల్మల్ నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ ఇలా చాలా గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమీటీలు తమ ఆగడాలను కొనసాగిస్తున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా త్వరలోనే రాష్ట్ర మానవ హక్కుల కమీషన్​ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

కలిసికట్టుగా పోరాడదాం రండి..

తెలంగాణలోని వివిధ రాష్ట్ర స్థాయి గంగపుత్ర సంఘాలు వీడీసీ ఆకృత్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు పూస సత్యనారాయణ బెస్త విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని చైతన్య సమితి అధికార ప్రతినిధి బెస్త సురేష్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కరోనా నిధులన్నీ ఏమయ్యాయో కేసీఆర్ లెక్క చెప్పాలి: ఎంపీ సోయం

Last Updated : Jul 13, 2020, 12:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.