నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ మైదానంలో ప్రముఖ జ్యోతిషుడు ప్రదీప్ జోషి ఆధ్వర్యంలో కోజాగిరి పౌర్ణమి సందర్భంగా రాజశ్యామల యాగం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఏనుగుపై అమ్మవారిని ఊరేగిస్తూ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గజోత్సవ శోభాయాత్ర కలెక్టర్ మైదానం చౌరస్తా నుంచి మొదలై ఎల్లమ్మగుట్ట చౌరస్తా, బస్టాండ్ ముందుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : "ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే"