ETV Bharat / state

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు - మహిళా దినోత్సవం

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ.. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు.

Free cancer screening tests at nizamabad District Govt hospital
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
author img

By

Published : Mar 7, 2021, 5:01 PM IST

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​లోని ఇందూర్​ కాన్సర్ హాస్పిటల్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. జిల్లా ప్రభుత్వాసుపత్రి మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మహిళలు.. తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని మేయర్​ సూచించారు. గృహిణి బాగుంటేనే.. కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం వల్లే.. క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్​ ప్రతిమా రాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా కానిస్టేబుల్​​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.