మద్ధతు ధర ప్రకటించాలని ఆర్మూర్‌లో రైతుల ధర్నా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని మామిడిపల్లి కూడలిలో రైతులు ఆందోళనకు దిగారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పంటలను ఆహార పంటలుగా గుర్తించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.