నిజామాబాద్ జిల్లా యువకులు ఉపాధి కోసం గల్ఫ్ బాటపట్టారు. కరోనా కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. వారంతా స్వస్థలాలకు రావడానికి నిజామాబాద్ ఎంపీ కవిత చొరవ తీసుకున్నారు. జిల్లా వాసులైన 35 మంది పది రోజుల క్రితం విజయవాడ చేరుకున్నారు.
హైదరాబాద్కు విమానాలు లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న విజయవాడ వచ్చారు. మాజీ ఎంపీ కవిత సహకారంతో వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. తమకు సహాయం అందించినందుకు గల్ఫ్ కార్మికులు... కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.