దళిత కుటుంబంలో పుట్టిన బాబు జగ్జీవన్ రాం... అత్యున్నత పదవిని చేపట్టి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రాం 113వ జయంతి వేడుకలను నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆయన విగ్రహానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
జగ్జీవన్ ఆశయాలను తెరాస ప్రభుత్వం ఆచరించి చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ లత, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి.పాటిల్, జిల్లా తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'చావు అంచుల వరకు వెళ్లినా.. పంథా మార్చుకోలే'