ETV Bharat / state

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్నప్రవాహం

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద నీరు భారీగా జలాశయానికి వస్తోంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 1078.60 అడుగులకు చేరుకుంది.

flood-water-flows-to-sriram-sagar-project
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్నప్రవాహం
author img

By

Published : Aug 17, 2020, 4:10 PM IST

ఎగువన కురుస్తున్న వర్షానికి నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తోంది. భారీ ప్రవాహం ప్రాజెక్టులోకి చేరుతుండటం వల్ల నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 70,182 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1078.60 అడుగులకు చేరుకుంది.

జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వసామర్థ్యం 48.698 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఔట్ ఫ్లో 776 క్యూసెక్కులు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరి, మంజీరా నదుల ద్వారా నీరు ఈ జలాశయానికి చేరుతోంది.

ఇదీ చూడండి : రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.