ETV Bharat / state

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు తగ్గిన ప్రవాహం - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 15 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 79 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

flood flow decreasing to sriramsagar project in nizamabad
శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు తగ్గిన ప్రవాహం
author img

By

Published : Aug 25, 2020, 5:21 PM IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పైనుంచి వచ్చే ప్రవాహం తగ్గుతోంది. గత 15 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1088.90 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 79 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రాజెక్టు ఎగువన అంటే మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టు నిండుకునే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్ట్ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇదీ చదవండి- వ్యాక్సిన్​ ఉత్పత్తిలో భారత్​ సాయం కోరిన రష్యా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.