నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఇటీవల నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ ప్రసంగాలకు బాలుడు నరసింహ స్పందించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ బాలుడు నర్సింహ.. భాజపా రాష్ట్ర కార్యాలయానికి రాగా బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. బాలుడిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లారు సంజయ్. నరసింహతో కలిసి భోజనం చేశారు. కొత్త బట్టలు పెట్టి.. బాలుడు నర్సింహతో సెల్ఫీ దిగారు.

బాలుడు నరసింహ పేదరికాన్ని చూసి బండి భావోద్వేగానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చాక తొలి రెండు పడక గదుల ఇల్లును నరసింహ కుటుంబానికే కేటాయిస్తామని సంజయ్ వెల్లడించారు. బాన్సువాడలో నరసింహ కుటుంబం ఉండే ఇంటి అద్దెను ఇకపై భాజపా చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నరసింహ చదువు బాధ్యతలను ఎంపీ అర్వింద్ చూస్తారన్నారు. సీఎం కేసీఆర్ పేదలను ఏవిధంగా మోసం చేస్తున్నారో నరసింహానే ఉదాహరణగా చెప్పవచ్చని బండి సంజయ్ అన్నారు.

ఇవీచూడండి: 'ఫీజు వేధింపులు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం'