నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పరిధిలోని మద్దెపల్లి గ్రామ శివారులోని గుట్టకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. వేసనికాలం కావడం, గుట్టకు ఉన్న చెట్లు, గడ్డి ఎండిపోయి ఉండడం వల్ల మంటలు వేగంగా విస్తరించాయి. మంటలు గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈలోపు మంటలు గ్రామం వైపు విస్తరించకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను ఆర్పివేశారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి:మాస్క్‌తో మార్నింగ్ వాక్.. చాలా డేంజర్!