ETV Bharat / state

'ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి'

author img

By

Published : Sep 28, 2020, 8:45 PM IST

ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని టీఆర్​ఎస్​కేవీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట పీల్డ్​ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు.

field assistants protest in front of nizamabad collectorate
'ఫీల్డ్ అసిస్టెంట్లపై సస్పెన్షన్​ ఎత్తివేసి.. విధుల్లోకి తీసుకోవాలి'

15 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించమని అడిగినందుకు సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి ప్రశ్నించారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

జీవో నంబర్‌ 4779 రద్దుచేయాలని తిరిగి వారని విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశ్, జీఎంపీఎస్‌ జిల్లా కార్యదర్శి గంగాధర్, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అధికారులు లంచాలు అడుగుతున్నారని ఆ రైతు ఏం చేశాడంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.