నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. జీవో నెంబరు 4779ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలకేంద్రంలో సమ్మె చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగాలను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!