ETV Bharat / state

మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం - రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్ జిల్లాలోని చిట్టాపూర్​లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో రైతు. చాలా రోజులుగా తన భూ సమస్యను తీర్చట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Oct 5, 2019, 7:37 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌లో రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. గ్రామాల్లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన రైతు రఘువీర్‌ తన భూసమస్యను పరిష్కరించట్లేదంటూ... మంత్రి ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని అధికారులు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గమనించిన స్థానికులు బాధితుడిపై నీళ్లు పోశారు. వెంటనే బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఒద్ది రఘువీర్​ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తమ తాతలు చిట్టాపూర్‌కు చెందిన రాజాగౌడ్‌ వద్ద 22 ఎకరాల భూమి కొనుగోలు చేశారని... అందులో తన వంతు వాటాగా సర్వే నంబర్‌ 1152/అ, సర్వేనంబర్‌ 1180/ఆ లో ఎకరం ఎనిమిది గుంటలు ఉందని బాధిత రైతు రఘువీర్‌ పేర్కొన్నారు. అయితే భూమి తమ కబ్జాలో ఉందని కాని పట్టాపుస్తకంలో మాత్రం వేరొకరి పేరున ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా తన సమస్య పరిష్కరించట్లేరని వాపోయాడు. గత 18 ఏళ్లుగా తాను ఉపాధి కోసం గల్ఫ్‌ దేశం వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన సమస్యలను తీర్చాలని కోరాడు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు 'అనిశా కస్టడీ'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.