ఇందూరు తొలి నాట్య గురువు టంగుటూరి బీమన్(74) కన్నుమూశారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యంతో గుర్తింపు సాధించి అనేక మందికి శిక్షణనిచ్చిన బీమన్.. అనారోగ్యంతో చనిపోయారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా బీమన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగ్రామం నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లిలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మధ్యనే భార్య చనిపోగా.. ఒక కుమార్తె ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి శాస్త్రీయ నాట్య కళాకారుడిగా గుర్తింపు సాధించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యంలో అనేక అవార్డులు, బిరుదులు సొంతం చేసుకున్నారు. 374 మంది కళాకారులతో నిజామాబాద్‌లో నిర్వహించిన పేరిణి మహాసమ్మేళనంతో ఐదు ప్రపంచ రికార్డులు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నాట్యాచార్యుడిగా అవార్డు అందుకున్నారు. బీమన్ శిష్యులు దేశ విదేశాల్లో స్థిరపడగా.. కొందరు సినీ రంగంలో రాణిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి