నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్‌లో బాలాజీ జెండా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతీ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను జరుపుతారు. పడద్ర ఏకాదశి నాడు జెండాను ప్రతిష్ఠించి ఐదో రోజున అంటే పౌర్ణమి రోజు పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొలటాలతో ఊరేగింపుగా ప్రధాన వీధుల్లో జెండాను తీసుకెళ్తారు. తర్వాత జెండాను ముడుపులతో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపుతారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: అత్త పాడె మోసిన నలుగురు కోడళ్లు!