ETV Bharat / state

'బాహుబలి పోలింగ్​కు భారీ ఏర్పాట్లు' - POLING

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారిన ఇందూరు లోక్ సభ నియోజకవర్గం పోలింగ్​కు ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. 185 మంది అభ్యర్థుల కోసం 12 యూనిట్లతో భారీ ఈవీఎంలను సిద్ధం చేశారు. కేవలం ఈవీఎంల నిర్వహణ కోసమే 600 మంది ఇంజినీర్లను సిద్ధం చేసింది.

'బాహుబలి పోలింగ్ కు భారీ ఏర్పాట్లు'
author img

By

Published : Apr 10, 2019, 8:00 PM IST

Updated : Apr 10, 2019, 9:00 PM IST

నిజామాబాద్ లోక్​సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం అయ్యాయి. ఇందూరు పరిధిలో ఉన్న 7 శాసన సభ నియోజకవర్గాలకుగాను నిజామాబాద్ జిల్లాలో 5, జగిత్యాల జిల్లాలో 2 స్థానాలు ఉన్నాయి. 185 మంది బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో 1788 పోలింగ్ కేంద్రాలు, 27 వేల బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసినట్లు నిజామాబాద్​ కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్​కి 15 మంది అధికారుల చొప్పున 33 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

మొట్ట మొదటిసారిగా..

ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎమ్​3 రకం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంచారు. నోటాతో కలుపుకొని 186 మంది బరిలో ఉన్నట్లు లెక్క. వీరందిరికీ సరిపోయేలా ఎల్ ఆకారంలో 12 ఈవీఎంలను అమర్చినట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేట్లు సహకరించాలని కోరారు.

ప్రత్యేక ఏర్పాట్లు:

12 యూనిట్లతో ఉన్న ఈ భారీ ఈవీఎంపై ఓటు ఎలా వేయాలో.. ఇప్పటికే భారీ ఎత్తున ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఈవీఎంల వరుస క్రమ చిత్రాల బ్యానర్లను ఏర్పాటు చేశారు. అంధులకు, దివ్యాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని వారందరూ కూడా పోలింగ్​లో పాల్గొనాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సూచించారు. నియోజకవర్గంలో ఒక హెలికాఫ్టర్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ స్టేషన్లలో వైద్య సిబ్బందిని నియమించినట్లు వివరించారు.

మాక్​ పోలింగ్​:

ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రం​ లోపల ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

'బాహుబలి పోలింగ్ కు భారీ ఏర్పాట్లు'

ఇవీ చూడండి: ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..

Intro:Body:

zxvx

Conclusion:
Last Updated : Apr 10, 2019, 9:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.